Natyam ad

ఆర్యవైశ్య అధ్యక్షులుగా చల్లా శివ శంకర్

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా చల్లా శివశంకర్ ను ఆర్యవైశ్య సభ్యులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర అధ్యక్షులు చిన్న వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు. కాణిపాకానికి చెందిన చల్లా శివశంకర్ జిల్లా అధ్యక్షులు గా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా చల్లా శివశంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఆర్యవైశ్య అధ్యక్షులుగా నియామకం చేపట్టడం హర్షించదగిన విషయమని శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఆర్యవైశ్యుల శ్రేయస్సు కోసం పాటుపడతానని తెలియజేశారు. అలాగే తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులు చిన్న వెంకట సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు ధర్మవరం జయంతి వెంకటేశ్వర్లు,ఏం. వెంకటేశ్వర్లు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

 

Post Midle

Tags:Challa Siva Shankar as Arya Vaishya President

Post Midle