పుంగనూరులో ఎస్సీ వర్గీకరణ అమలుకై దీక్షలు
పుంగనూరు ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఎస్సీవర్గీకరణకు చట్టబద్దత కల్పించనందుకు నిరసనగా ఎంఆర్‌పీఎస్ , ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎంఆర్‌పీఎస్ నాయకులు నరసింహులు, ఫృద్వీకుమార్ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. నరసింహులు మాట్లాడుతూ ఎంఆర్‌పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిరాహారదీక్షలు చేపట్టామన్నారు.100 రోజుల్లో వర్గీకరణ చేపడుతామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. నిరసనలు చేస్తున్న కార్యకర్తలపై బిజెపి రౌడీయిజం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అమలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షల్లో నేతలు గంగాధర్, శేషకుమార్, నాగేంద్రబాబు, అనంతకుమార్, రెడ్డి ప్రసాద్, విద్యాసాగర్, రాఘవ, విజయకుమార్, శ్రీనివాసులు, చౌడప్ప, భవానిప్రసాద్, గోవిందు పాల్గొన్నారు.

Tags: Chalo Collectorate at Punganur on 25th
