Natyam ad

బీసీల బడ్జెటు 2 లక్షల కోట్లు కేటాయించాలని ఏప్రిల్ 3 మరియు 4న ఛలో ఢిల్లీ

పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన- పోస్టర్ ఆవిష్కరణ

 

హైదరాబాద్   ముచ్చట్లు:

 

కేంద్ర ప్రభుత్వం బీసీల బడ్జెటు 2 లక్షల కోట్లకు కేటాయించాలని బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 3 మరియు 4న చలో ఢిల్లీ కార్యక్రమం పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరపాలని రాజ్యసభ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు నిచ్చారు. మం సందర్భంగా బీసీ భవన్ నందు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ కన్వీనర్ లాల్ కృష్ణ. జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, నీల వెంకటేష్ అధ్యక్షతన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికలలో బి సి లకు అన్ని రాజకీయ పార్టీలు బి సి లకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు. బి.సి లకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు బి సి లను ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారు. రాజ్యాధికారంలో వాట ఇవ్వకుండా 75 సం.లుగా అన్యాయం చేస్తూన్నారు. జెండాలు మోసుకుంటు, జిందాబాద్ ల నినాదాలు ఇస్తూ బిసిలను వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమం లో అంజి, వేముల రామకృష్ణ, సతీశ్, నరసింహ గౌడ్, రావుల రాజు,కృష్ణమాచారి, శ్రీమాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags;Chalo Delhi on April 3 and 4 that the budget of BCs should be allocated 2 lakh crores

Post Midle