చాణుక్య ఫస్ట్ లుక్

Chanakya first look

Chanakya first look

Date:12/06/2019

గోపీచంద్ హీరోగా నటిస్తోన్న స్పై-థ్రిల్లర్ మూవీ ‘చాణక్య’. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. గోపీచంద్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్ర పోషించింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇండో-పాక్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ను అత్యధిక శాతం జైపూర్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జరిపారు. ఇదిలా ఉంటే, నేడు (జూన్ 12న) గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘చాణక్య’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. గుబురు గడ్డంతో జనం మధ్య నడుచుకుంటూ వస్తున్నట్లు ఉన్న గోపీచంద్ లుక్ అదిరింది. పోస్టర్ చూస్తుంటే ‘సాహసం’ సినిమా గుర్తుకొస్తోంది. అందులో కూడా పాకిస్థాన్ భూభాగంలోకి గోపీచంద్ అడుగుపెడతాడు. ఈ సినిమా షూటింగ్ కూడా జైపూర్ పరిసరాల్లోనే జరిగింది. అయితే, ఆ సినిమాతో పోలిస్తే ‘చాణక్య’లో గోపీచంద్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. మరి ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో గోపీచంద్ ప్రేక్షకులను ఏ మేర మెప్పించనున్నారో చూడాలి. వాస్తవానికి గోపీచంద్ ప్రస్తుతం వరుస పరాజయాలతో డీలా పడ్డారు. ఇలాంటి సమయంలో ఆయనకు ఒక హిట్టు అవసరం. ఈ సినిమా కచ్చితంగా గోపీచంద్ దాహాన్ని తీరుస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. గోపీచంద్ కెరీర్‌లోనే ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోనుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాగా, ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా.. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు రాశారు.

ఇండియా మ్యాచ్ కు వర్షం అడ్డంకే

Tags:Chanakya first look

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *