Natyam ad

చందక్ ల్యాబ్ ను తరలించాలి

యాదాద్రి ముచ్చట్లు:

యాదాద్రి  భువనగిరి జిల్లా బీబీనగర్ (మ) కొండమడుగు లో చందక్ లాబరేటరీ రసాయన పరిశ్రమను ఈక్కడ నుండి తరలించాలని ఆరు రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కొండమడుగు గ్రామస్తులు కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు.  కంపెనీ మిషనరీని రేపు ఉదయం 10 గంటల వరకు తొలగించాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కొండమడుగు పరిసరాలలో చందక్, ఆస్ట్రర్, అజంతా ఏర్పాటు చేసిన ఓల్డ్ మిషనరీ ద్వారా నడుస్తున్న రసాయన పరిశ్రమలను తొలగించాలి. మూడు పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు వెంటనే రసాయన కంపెనీలు ఎత్తేయాలి. కొండమడుగు ఇండస్ట్రీల జోన్ నుంచి తొలగించి రెసిడెన్షియల్ జోన్ చేయాలి.  కొండమడుగు లో ఉన్న రసాయన పరిశ్రమలను తొలగించే వరకు పోరాటం చేస్తా.  ఎంఎంటిఎస్ రాయగిరి వచ్చేంది ఉండే రాష్ట్ర ప్రభుత్వం తొంభై కోట్లు కట్టక పోవడంతో ఆగిపోయిందని అన్నారు.

 

Tags: Chandak Lab should be moved

Post Midle
Post Midle