అమరావతి ముచ్చట్లు:
‘జాబిల్లి రావే..’ అంటూ మనం పాటలు కూర్చిన చందమామ భూమికి దూరంగా జరిగిపోతోందట. విస్కసిన్-మ్యా డిసన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏటా 3.8cm చొప్పున చంద్రుడు దూరమవుతుండటం భూభ్రమణం మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. 200 మిలియన్ సంవత్సరాల తర్వాత భూభ్రమణానికి 25 గంటలు పడుతుందని పేర్కొన్నారు. కాగా 1.4 బిలియన్ ఏళ్ల క్రితం ఓ రోజు 18 గంటల్లో పూర్తయ్యేదని పరిశోధనలో తేలింది.
Tags: Chandamama is getting away from us!