Natyam ad

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన చండీయాగం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) శుక్ర‌వారం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 3 నుంచి 11వ తేదీ వరకు చండీయాగం నిర్వహించారు.ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు చండీహోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు కలశాభిషేకం నిర్వహించారు.సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో  దేవేంద్ర‌బాబు, ఏఈవో  శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీబాల‌కృష్ణ‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Post Midle

నవంబరు 12 నుంచి రుద్రయాగం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 12 నుంచి 22వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) జరుగనుంది.గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

Tags: Chandi Yagam ended grandly at Sri Kapileswara Swamy temple

Post Midle

Leave A Reply

Your email address will not be published.