Natyam ad

టీడీపీ తులసివనంలో చంద్రబాబే గం జాయి మొక్క..కొడాలి నాని సెటైర్లు

గుడివాడ ముచ్చట్లు:


గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యా ఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. కొడాలి నానికి తానేంటో చూపిస్తానని చంద్ర బాబు ఇచ్చిన వార్నింగ్పై గట్టి సెటైర్ ఇచ్చారు. చంద్ర బా బు ఉడత ఊపులకు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు తన వెంట్రుక ముక్క కూడా పీకలేడని ఎద్దేవా చేశారు.గుడివాడలో నిర్వహిం చిన రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గుడివాడలో ఎంతో మంది మహానుభావులు పుట్టా రని.. కానీ బూతులు మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని కొడాలి నానిని ఉద్దేశించి మాట్లాడారు. నా దగ్గర ఓనమాలు నేర్చుకుని నన్నే విమర్శి స్తారా అని మండిపడ్డారు. కొడాలి నాని ఓ గంజాయి మొక్క అని ఎద్దేవా చేశా రు. పిచ్చి ఆటలు మానుకోవాలని.. నోరు పారేసుకోవద్దని హెచ్చరించారు. కొడాలి నానికి తానేం టో నిరూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఎవరినీ వదిలిపె ట్టే ది లేదని.. త్వరలోనే వాళ్ల కథ చెబు తానని హెచ్చ రించారు. అయితే చంద్ర బాబు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని కూడా అంతే ధీటుగా స్పందించారు. తాను గంజాయి మొక్కను కాదని.. గుడివాడ ముద్దు బిడ్డను అని స్పష్టం చేశారు. టీడీపీ తులసివనంలో చంద్రబాబే గంజాయి మొక్క అని కౌంటర్ ఇచ్చారు.

 

Tags: Chandrababe gam jai mokka..Kodali Nani satires in TDP Tulsivanam

Post Midle
Post Midle