చంద్రబాబు,లోకేష్ లే డేటా చౌర్యం చేసారు

-ఎమ్మెల్యే, అబ్బయ్యచౌదరి

 

అమరావతి ముచ్చట్లు:

దేశేలోనే అతిపెద్ద డేటా చౌర్యం ఏపీలో జరిగిందని అధికార పార్టీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. అందుకే స్పీకర్ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులతో నాలుగు పర్యాయాలు హౌస్ కమిటీ సమావేశం నిర్వహించాం. ఇంటెరిమ్ రిపోర్ట్ సాక్షిగా చెబుతున్నాం. చంద్రబాబు, లోకేష్ రాష్ట్ర ప్రజల డేటాను చోరీ చేశారు. లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కుట్ర జరిగింది. ప్రజాసాధికారత సర్వే పేరుతో డేటాను చోరీ చేశారు. ఏదోరకంగా అధికారంలోకి రావాలనే ఆలోచనతో 2019 ఎన్నికల సమయంలో కుట్ర పన్నారు. సేవా మిత్ర యాప్ పేరుతో పన్నాగం పన్నారు. స్టేట్ డేటా సెంటర్ కు యాక్సెస్ చాలా కష్టం. కానీ అందరినీ మ్యానేజ్ చేసి డేటా చోరీ చేశారని అన్నారు.

 

 

ప్రభుత్వానికి చెందిన ఐపీ అడ్రస్ నుంచి సేవామిత్ర ఐపీకి డేటా పంపించారు. 14 టెరా బైట్ డేటా చోరీ చేశారు. 7వేల సినిమాలు పట్టేంత డేటాను సేనామిత్ర ఐపీ అడ్రస్ కు పంపించారు. టీడీపీకి చెందిన సేవామిత్ర ఐపీ అడ్రస్ కు ఎందుకు పంపించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
ఆధార్ నెంబర్లను మాస్కింగ్ చేయకుండా పంపించారు. డేటా ఆధారంగా ప్రజలకు మెసేజ్ లు, ఫోన్లు చేశారు. వారికి వ్యతిరేకంగా సమాధాలు ఇచ్చిన వారి ఓట్లు తొలగించారు. ప్రజలతో పాటు ఉద్యోగుల డేటాను బ్యాంక్ అకౌంట్లతో సహా కాజేశారని ఆరోపించారు. గతంలో చేసిన తప్పులు బయటపడతాయని ప్లాన్ ప్రకారం చంద్రబాబు అసెంబ్లీకి రావడం లేదు. లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే కదా డేటా ట్రాన్స్ ఫర్ అయ్యింది.

 

 

 

ఎందుకు హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ ఫర్ అయ్యిందో లోకేష్ సమాధానం చెప్పాలి. 30 లక్షల మంది ప్రజల సమాచారాన్ని ఎందుకు చోరీ చేశారో సమాధానం చెప్పాలి. లోకేష్ ను వదిలిపెట్టం… ముందుంది అసలు సినిమా. డేటా చౌర్యం పై చర్చించడానికి మేం సిద్ధం…చంద్రబాబు సిద్ధమా . ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ పార్టీ ఏం దౌర్భాగ్యం చేసుకుందో. చంద్రబాబు, లోకేష్ పుణ్యమా అని టీడీపీ సర్వనాశనం అయ్యింది. ఈరోజు సభలో టీడీపీ సభ్యులను చూస్తుంటే అతడు సినిమా గుర్తొస్తుంది. చంద్రబాబు తనికెళ్ల భరణి మాదిరి …టీడీపీ అనే డొక్కు కారును ఇచ్చి సభకు పంపించాడు. కుప్పాన్ని ఢీకొట్టి గెలవబోతున్నాం. ఆడుమగాడురా బుజ్జి అని మీరు జగన్ ను గుర్తు చేసుకోవడం ఖాయమని అన్నారు.

 

Tags: Chandrababu and Lokesh have stolen data

Leave A Reply

Your email address will not be published.