చంద్రబాబు ఇక్కడ ఓట్లు ఎలా అడుగుతాడు

Chandrababu asks votes here
Date:10/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
పాలమూరు దిండి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి ఉమా భారతికి లేఖ చంద్రబాబు రాసాడు. అలా లేఖలు రాసిన చంద్రబాబు ఇక్కడ ఎలా ఓటు అడుగుతాడని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం అయన రంగారెడ్డి ఇబ్రహీంపట్నం లో జరిగిన రైతు సమ్మేళనం లో అయన ప్రసంగించారు.  నిన్న ఆంద్ర ప్రభుత్వం ఈ ప్రశ్న పై స్పందించింది.
ఖచ్చితంగా పాలమూరు దిండి ప్రాజెక్టు అడ్డుకుంటమన్నరు. మనం ఎలా ఓటేస్తం వారికని అయన అన్నారు. ప్రధాని  నరేంద్ర మోడి చంద్రబాబు ను పక్కన కూర్చోబెట్టుకుని గత ఎన్నికలప్పుడు తమను గెలిపిస్తే ఈ ప్రాజెక్టు ను పూర్తి చేస్తమన్నరు. మరిప్పుడు బాబు ఏమంటడని అడిగారు.  బాబు తెలంగాణ లో ఒక మాట ఆంద్రలో ఒక మాట మాట్లాడుతున్నడు. –
మహా కూటమికి ఓటేస్తే మల్లి మన అస్తిత్వాన్ని బాబు దగ్గర తాఖట్టు పెట్టాల్సి వస్తదని అన్నారు.  జానారెడ్డి దిండి ప్రాజెక్టు కోసం కష్టపడ్డ అన్నడు..మరి కూటమిలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నరు. మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేయమని ఏమైన హామీ తీసుకున్నరా అని అడిగారు.  రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కావాలంటే కేసియార్ కే ఓటెయ్యాలి.  సంక్షేమానికైతే కేసియార్ కు, సంక్షోభానికైతే మహా కూటమికి ఓటెయ్యాలి.  కాంగ్రెస్ కు ఓటేస్తే డిల్లీకిపోతదని అన్నారు.
టీడిపీకి ఓటేస్తే అమరావతి కి పోతది.  టీజేఎస్ కు ఓటేస్తే ఎటుకాకుండా పోతది.  టీయారెస్ కు ఓటేస్తే సంక్షేమంలో దూసుకుపోతది.  చంద్రబాబును ఎప్పుడూ ప్రశ్నిస్తూనే వుంటానని అన్నారు.  పదవులను తృణప్రాయంగా వదిలిన వాన్ని. నన్ను ఎంత తిడితే అంత గట్టిగా అవుతాన్నారు.  డిసెంబర్ 7 తర్వాత తెలంగాణ లో టీడీపి ఉండదు.  చేతులు కట్టుకునే వాళ్లము  కాదు.
చెయ్యెత్తి ప్రశ్నించే వాల్లను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుంటారు.  మహబూబ్ నగర్ లో వలసలకు వెళ్లిన వారు తిరిగి వచ్చారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడి ప్రాంతం సస్యశ్యామలం అయిందని అయన అన్నారు.  మనం వలసలు వెళ్లిన వారిని తిరిగి రప్పిస్తే, మన కాంగ్రెస్ వాళ్లు పొలిమేర దాక పోయిన టీడీపి వారిని  తిరిగి తీసుకు వస్తున్నరని ఆరోపించారు. ఎంపీ  బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ  అరవై యేండ్ల పాలనలో మనకు ఏనాడైనా కాలువల ద్వారా నీరు వచ్చిందా
..కానీ మంచి రెడ్డి కిషణ్ రెడ్డి ఆద్వర్యంలో త్వరలోనే ఆ కల నెరవేరనుందని అన్నారు.  శ్రీశైలం ప్రాజెక్ట్ చంద్రబాబు చేతిలో ఉంది. వారికి పట్టం కడితే మనకు నీల్లు వస్తయా అని అడిగారు.  1330 టీఎంసీ ల నీటి కేటాయింపులు తెలంగాణకు ఉంది.  కూటమికి ఓటేస్తే మనకు  కరెంట్ కట్ అవుతదని అన్నారు.  రైతులు విత్తనాలు, యూరియా కోసం పడిగాపులు పడుతు లైన్ లలో నిల్చునే పరిస్థితి వస్తదని అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తెరాస అభ్యర్ధి  మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ  గత నాయకులు రైతాంగాన్ని పట్టించుకోలేదు. రైతు పక్షపాతి  సీయం కేసియార్ అని అన్నారు.  హరీష్ రావు చేతుల మీదుగా పెద్ద చెరువును పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నం.  నాకు పదవి ముఖ్యం కాదు సాగు నీరు, ఉపాది కావాలని సీయం గారిని అడిగాను. అడిగిన వెంటనే సమ్మతి తెలిపారని అన్నారు.  రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శివన్నగూడ నుండి 15టీఎంసీ ల నీరు రానుంది.   మన నియోజకవర్గంకు త్వరలోనే నీళ్ళు రావడం ఖాయమని అన్నారు.
Tags; Chandrababu asks votes here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *