Chandrababu bow to the Amaravati soil

అమరావతి మట్టికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం

Date:28/11/2019

అమరావతి ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు గురువారం రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కూల్చి వేసిన ప్రజావేదికను ఆయన పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన స్థలానికి చేరుకున్న బాబు అక్కడ అమరావతి మట్టికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడం చాలా బాధేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. భావితరాల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేద్దామనుకుంటే.. వైసీపీ నేతలు అడ్డుపడ్డారని చంద్రబాబు అన్నారు. అంతకుముందు చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. బాబు పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా యత్నించారు. ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు విసిరారు. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ వర్గీయులను రోప్ పార్టీ అడ్డుకుంది.

 

ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ పై బిజెపి కొరడా

 

Tags:Chandrababu bow to the Amaravati soil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *