రైతు రుణమాఫి పేరుతో చంద్రబాబు మోసం

తిరుమల ముచ్చట్లు:

 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం  ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు.  ప్రత్యర్థి పార్టీల రాజకీయ ఆరోపణలపై ఆఎ  స్పందించారు.  రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసి  మొదటి సంతకాన్ని చంద్రబాబు అపహాస్యం చేశారని అన్నారు. చంద్రబాబు హయాంలో కెసిఆర్ నీళ్ల విషయంలో ఏపీకి అన్యాయం చేసినా అడిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ ను ఉద్దేశించి ఉమా అక్క అంటూ వ్యాఖ్యానించారు. అలాగే రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ సిద్ధాంతాలు పక్కనబెట్టి చంద్రబాబు పనిచేస్తూ కోవర్టు రెడ్డి గా మారారని విమర్శించారు. జగన్ ,కేసిఆర్ లు తన ఇంట్లో నీళ్ల ఒప్పందాలు చేసుకున్నారని అబద్ధపు ఆరోపణలు చేయడం తగదన్నారు. తమిళనాడులో దైవదర్శనానికి వెళుతూ నగిరి లో మార్గ మధ్యలో ఉన్న తన ఇంటికి కేసీఆర్ వచ్చారని తెలిపారు.  చంద్రబాబు హయాంలో కెసిఆర్ ఇంటికి ఆహ్వానించి 28 రకాల వంటలతో భోజనం పెట్టిన సంగతి మర్చిపోయారా అంటూ వ్యాఖ్యానించారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Chandrababu cheated in the name of farmer loan waiver

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *