చంద్రబాబు గారు..మరి వైసీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారు

Chandrababu Garo .. How did the MLC MLAs buy?

Chandrababu Garo .. How did the MLC MLAs buy?

Date:30/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 40మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ.. మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ ఘాటుగా ట్వీట్లు చేశారు. చంద్రబాబు ట్వీట్లకు విజయసాయి కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో ఎలా చేర్చుకున్నారంటూ ప్రశ్నించారు. విజయసాయి తన ట్వీట్‌లో ‘మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి చంద్రబాబు? 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఎక్కడో ప్రధాని అంటే అమరావతిలో కూర్చుని పళ్లుకొరుకుతున్నారు. అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ పెద్ద పాలేరులా అడ్డుపడితే నైతికత గుర్తు రాలేదెందుకో?’ అన్నారు.
మా పార్టీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేసినప్పుడు ఈ సుమతీ శతకాలు ఏమయ్యాయి .
చంద్రబాబు? 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఎక్కడో ప్రధాని అంటే అమరావతిలో కూర్చుని పళ్లుకొరుకుతున్నారు. అనర్హులుగా ప్రకటించాల్సిన స్పీకర్ పెద్ద పాలేరులా అడ్డుపడితే నైతికత గుర్తు రాలేదెందుకో?‘చివరాఖరున చంద్రబాబు చేసిన మరో ఘోర తప్పిదం సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం గారిని ధూషించడం. ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్టేషన్ లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది సారుకు. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు రేపు గద్దె దిగిన తర్వాతా బాబును వెంటాడతాయి’అన్నారు.చివరాఖరున చంద్రబాబు చేసిన మరో ఘోర తప్పిదం సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం గారిని ధూషించడం. ఓటమి దగ్గరపడిందన్న ఫ్రస్టేషన్ లో ఆయనపై నోరు పారేసుకున్న ఫలితం ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది సారుకు. తవ్వకుండానే బయట పడుతున్న ఆర్థిక అవకతవకలు రేపు గద్దె దిగిన తర్వాతా బాబును వెంటాడతాయి.రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని చెబుతుంటే.. అభివృద్ధిలో అనుకున్నాం.. అప్పుల్లోనా’అంటై సైరా పంచ్ విసిరారు.
Tags: Chandrababu Garo .. How did the MLC MLAs buy?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *