చంద్రబాబు గో బ్యాక్
పిలేరు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా, పీలేరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన వేళ కలకలం చెలరేగుతోంది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో గోబ్యాక్ బాబు.. సైకో చంద్రబాబు.. మతకలహాలు సృష్టిస్తున్న చంద్రబాబు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పీలేరు సబ్ జైల్ లో ఇవాళ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించనున్నారు.ఆ జైలులోరిమాండ్ ఖైదీలుగా ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ములాఖత్ కు చంద్రబాబు నాయుడితో పాటు మరో ఆరుగురికి అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు నాయుడు ఇవాళఅక్కడకు వెళ్తున్నారు. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రొంపిచెర్ల పట్టణ కార్యకర్తలను ములాఖత్ ద్వారా ఇటీవల స్థానిక టీడీపీ నేతలు కూడాపరామర్శించారు.గతంలో పుంగనూరులో టీడీపీ నేతలు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లోనూ ఇరు పార్టీల నేతలు ఫ్లెక్సీల విషయంలోనేగొడవపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారని పలుసార్లు మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పీలేరు సబ్ జైల్ కు వెళ్తుండడంతో మరోసారి
ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Tags; Chandrababu go back

