ఆరోగ్యశ్రీ సేవలందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం

Chandrababu Government fails to provide Aarogyasri services

Chandrababu Government fails to provide Aarogyasri services

Date:11/01/2019
విజయవాడ ముచ్చట్లు:
చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలందించడంలో ఘోరంగా విఫలమైంది. బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని డిసెంబర్ లో ఆషా (ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటి హాస్పిటల్ అసోసియేషన్ ) అల్టిమేటం ఇచ్చింది. జనవరి 1 వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు రోగులకు అందడంలేదని వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడు అయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లక్షకేసులకు సంబంధించి క్లైయిమ్స్ పెండింగ్ లో ఉండటం వల్ల ఆస్పత్రులు ఇబ్బందులలో ఉన్నాయి. నెట్ వర్క్  ఆస్పత్రులు సంఖ్య 435 నుంచి 900కు చేరినా సిబ్బంది సంఖ్యను పెంచలేదు. జేఇఓ లు ఈ క్లెయిమ్స్ చూస్తూ ఉంటారో వారు కూడా సంఖ్య కూడా పెంచలేదని అయన అన్నారు. ఈ విధంగా చూస్తే నెట్ వర్క్ ఆస్పత్రులకు 320 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. 600 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది.దీనివల్లనే ఆరోగ్యసేవలు అందించకుండా నిరాకరిస్తున్నాయి. -ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కు సరైన సిఇఓ లేడు.ఇన్ ఛార్జ్ సిఇఓలను నియమిస్తూ వస్తోంది.ఐఏఎస్ ఐపిఎస్ క్యాడర్ ఉన్న అధికారిని నియమించకపోవడం దారుణమని అన్నారు.
రవిశంకర్ అయ్యన్నార్ బదిలీ అయిన తర్వాత సరైన పర్యవేక్షణ లేదు. ఆరోగ్యమిత్రలు 2000 మందికి పైగా అవసరముంటే 700 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఆరోగ్యసేవలు అందక పేదవాళ్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి  సమయంలో 100 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తామని జిఓ ఇచ్చారు. రోగికి సెలైన్ ఎక్కించాల్సిన సమయంలో వెంటిలేటర్ పైకి పంపుతున్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఉంది. చంద్రబాబు ప్రతిపక్షాన్ని ఎలా అధికారంలోకి రాకుండా చూడాలి.ఎవరికి తాయిలాలు ఇవ్వాలి,బదిలీలు,పోస్టింగ్ లు  ఇవే ఆయనకు కనిపిస్తున్నాయి తప్పితే పేదలకు వైద్యం అనే అంశం కనబడటంలేదని విమర్శించారు. ప్రభుత్వాసుపత్రులలో డెలివరీలు బాగా జరుగుతుంటాయి.కాని నేడు ఆరోగ్యశ్రీ సేవలలో డెలివరీస్ ను కూడా చేర్చారు. ఇది  ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేసే చర్య అని అయన విమర్శించారు.
Tags:Chandrababu Government fails to provide Aarogyasri services

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *