Natyam ad

చంద్రబాబుకు బెయిల్ మంజూరు

అమరావతి ముచ్చట్లు:

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్రావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు గురువారం (ఈనెల 17న) ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా సోమవారం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

 

Post Midle

Tags: Chandrababu granted bail

Post Midle