Natyam ad

చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు గుండు కొట్టేసాడు..!జగనే మరలా ముఖ్యమంత్రి-ఎమ్మెల్యే ప్రసన్న

నెల్లూరు ముచ్చట్లు:


చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్ర ప్రజలను ముంచేసాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించారు. ఐదో వార్డ్ లోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసింది శూన్యమని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డే మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని కుట్రలు చేసిన జగన్ ను కదిలించలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజాతో పాటు, కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

 

Tags; Chandrababu has killed the people of the state..! Jagan is the Chief Minister again – MLA Prasanna

Post Midle
Post Midle