మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు- ఎంపీ రెడ్డెప్ప బాబుకు హెచ్చరికలు
– బాబును ఎక్కడైనా ఓడిస్తాం
– కాంట్రాక్ట్ కాదు …అభివృద్ధి పనులు
– వాస్తవాలు బాబు తెలుసుకుని మాట్లాడాలి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర అటవీ, ఇంధనశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిని విమర్శించే అర్హత చంద్రబాబు నాయకుడు లేదని , రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా చంద్రబాబును ఓడించే సత్తా పెద్దిరెడ్డి కుటుంభానికి ఉందని , మంత్రి పెద్దిరెడ్డి కాంట్రాక్ట్ పనులు చేయలేదని ఆయన చేస్తున్నది అభివృద్ధి కార్యక్రమాలని, వాటిని చూసి చంద్రబాబు అండ్‌కో మాట్లాడాలని లేకపోతే తగిన గుణపాఠం నేర్పుతామని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప హెచ్చరికలు చేశారు. గురువారం మధ్యాహ్నం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి తో కలసి ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ మదనపల్లెలో జరిగిన మిని మహానాడులో చంద్రబాబునాయుడు పెద్దిరెడ్డి కుటుంబంపైన, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన చేసిన ఆరోపణలపై మండిపడుతూ తెలుగుదేశం పాలనలో కుప్పం నియోజకవర్గాన్ని కూడ చంద్రబాబునాయుడు అభివృద్ధి చేయలేదని ఎద్దెవా చేశారు. హంద్రీనీవా కాలువ నీటిని విడుదల చేసి, చెరువులకు నీటిని పంపి రైతులకు నీటి సమస్యలేకుండ చేసిన ఘనత మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దక్కిందని స్పష్టం చేశారు. మహానాడులో చంద్రబాబు చెప్పిన మాటలు అపద్దాలని వాటిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. కుప్పంకు హంద్రీనీవా కాలువ పూర్తికాకుండానే తామే నీటిని వదిలామని అపద్దాలు చెప్పి ప్రజలను మోసగిస్తే , కుప్పం ప్రజలకు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. చంద్రబాబునాయుడు మాటలు ప్రజలు నమ్మకపోవడంతో రెచ్చిపోయి తప్పుడు ప్రకటనలు ఇవ్వడం , ప్రజలను రెచ్చగొట్టడం చేయడం మంచిదికాదన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం ప్రజా సేవలో నిరంతరం కొనసాగుతూ ప్రజలకు వెన్నుముకగా నిలిచారని కొనియాడారు. చంద్రబాబుకు పలుసార్లు తాను సవాల్ విసిరానని , వాటికి చంద్రబాబు నుంచి సమాధానాలు లేవని, దమ్ముంటే పెద్దిరెడ్డి కుటుంబంతో ఢీకొనాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, రాజారెడ్డి, గురివిరెడ్డి, సుబ్రమణ్యం, చంద్రారెడ్డి యాదవ్, రమణ, బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags: Chandrababu has no right to criticize Minister Peddireddy- Warnings to MP Reddappa Babu