Natyam ad

నిరాశలో చంద్రబాబు – మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు ముచ్చట్లు:
 
కేవలం ఎన్నికలప్పుడే చంద్రబాబు కుప్పం కు వచ్చే వారు. ఈరోజు గ్రామాలు తిరగాలని చంద్రబాబు ఆలోచన చేశారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా కుప్పం లో చంద్రబాబు పర్యటించని గ్రామాలు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం  వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మేము మా ఎమ్మెల్యేలు అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. కేవలం ఒడిపోతామన్న భయంతో, అభద్రతా భావంతో మూడు రోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారు. చంద్రబాబు కుప్పం బాట పట్టడం మా నైతిక విజయం. తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు కుప్పం లో గెలవడని కుప్పం ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా కుప్పంలో గెలిచే పరిస్థితి లేకుండా చూస్తాం. సీఎం  వైఎస్ జగన్ పేరును భ్రష్టు పట్టించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. 14 ఏళ్ళు చంద్రబాబు సీఎం గా ఉన్నా  వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు అర్హులకి ఇల్లు, పెన్షన్లు అందలేదు. కేవలం పేదరికం కొలమానంగా చూసి అర్హులకు పధకాలు అందిస్తున్నాం. పల్లెబాట కార్యక్రమం చేపడితే గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు. 14ఏళ్ళు సీఎం గా ఉండి ఈపని చేశా, ఆ ప్రాజెక్ట్ కట్టా అని చెప్పే గొప్ప పనులు చంద్రబాబు చేయలేదు. కేవలం నిరాశ, నిస్పృహతో సీఎం  వైఎస్ జగన్ పై చంద్రబాబు విరుచుకుపడుతున్నారని అన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Chandrababu in despair – Minister Peddireddy Ramachandrareddy