ఢిల్లీ ధర్మపోరాట సభలో చంద్రబాబు

Being aggressive in terms of ticket fixing

Being aggressive in terms of ticket fixing

Date:11/02/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఏపీకి న్యాయం చేసే వరకు, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఏపీ భవన్లో చేపట్టిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడారు. చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రంపై కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమని, నీచమని, మంచి పద్ధతి కాదని అన్నారు. కేంద్రం అన్యాయం చేసినందుకే పోరాటం చేస్తున్నామన్నారు.  విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమపై అతీగతీ లేదన్నారు.
రెవెన్యూ లోటు తీర్చలేదని, రాజధాని నిర్మాణానికి నిధులు కూడా ఇవ్వలేదన్నారు. మోదీ అడుగుతున్నట్టుగా లెక్కలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అదే లెక్కలు మోదీ కూడా చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు భాజపా నేతలే చెప్పారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అడిగారు. అలాంటిది ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేశారు. ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారు. పోలవరం డీపీఆర్ను ఆమోదించలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమపై అతీగతీ లేదు. రెవెన్యూ లోటు తీర్చలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని అయన అన్నారు.
ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే మాపై దాడులు చేస్తున్నారన్నారు. ఎన్ని రకాలుగా దాడులు చేసినా భయపడేది లేదన్నారు. ఏపీ ప్రజల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఐదు కోట్ల ప్రజల కోసం ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. అన్యాయం చేస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు.  పరిపాలించే వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. బాధ్యత విస్మరించి, ఇష్టానుసారం చేస్తామని, అధికారం నెత్తికెక్కినప్పుడు… మళ్లీ ఆ నెత్తికెక్కిన అధికారాన్ని దించే అధికారం ఈ ప్రజలకు ఉందని గుర్తు పెట్టుకోవాలి. మనం పోరాడేది మన కోసం కాదని అయన అన్నారు. ఇప్పటికైనా మూడు రోజుల సమయం ఉంది.
చేసింది తప్పని పార్లమెంట్లో ఒప్పుకుంటే ఏపీ ప్రజలు క్షమిస్తారు. లేకుంటే శాశ్వతంగా ఈ భాజపాను, నరేంద్రమోదీని రాష్ట్ర ప్రజలు బహిష్కరిస్తారు. ఏపీ చరిత్రలో మీ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుందని  చంద్రబాబు హెచ్చరించారు ఈ దీక్షలో  ఎన్జీవో, ప్రజా, విద్యార్థి సంఘాలు  పాల్గొన్నాయి.  నల్లచొక్కాలతో టీడీపీ నేతలు దీక్షా స్థలికి తరలివచ్చారు. ప్రత్యేక హోదా నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది.  అంతకుముందు చంద్రబాబు రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ సమాధికి సీఎం నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.
Tags; Chandrababu in the Delhi Dharmaporata Sabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *