వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు
పార్వతీపురం మన్యం ముచ్చట్లు:
పార్వతీపురం కేంద్రంలో నిన్న పర్యటనలో నారా చంద్రబాబు నాయుడు పార్వతీపురం లోబహిరంగ సభలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు పై నియోజకవర్గ అభివృద్ధిపై ఆరోపణ చేసిన చంద్రబాబుపై ఎమ్మెల్యే జోగారావు ఫైర్ అయ్యారు. వెన్నుపోటుకు కేరాఫ్ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడని అన్నారు.చంద్రబాబు నాయుడు మోసపూరిత వ్యాఖ్యలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో పార్వతీపురం వచ్చిన చంద్రబాబు నాయుడు మన్యం జిల్లా అభవృద్ధికి ఏం చేస్తారో వివరించలేదు. దళితులంటే మాజీ సీఎం చంద్రబాబుకు చులకన అందుకే మన్యం జిల్లాలో మూడు ఎస్టీ, ఒక ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నా దళిత ఎమ్మెల్యే అయిన నా మీద మాత్రమే ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో మాజీ ఎమ్మెల్సీతో పాటు మీ నాయకులు కూడా అనేక కబ్జాలు చేశారు..నిరూపించడానికి మేం రెడీ. నా పైన చేసిన కబ్జా అరోపణలు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమని సవాల్ విసిరిన ఎమ్మెల్యే జోగారావు అన్నారు.

Tags: Chandrababu is a carafe for back pain
