Natyam ad

ఓట్లు అడిగే అర్హత చంద్రబాబుకు లేదు- మంత్రి పెద్దిరెడ్డి

– కిరణ్‌ చచ్చిన పాము.

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసగించే చంద్రబాబుకు ఓట్లు అడిగే అర్హత లేదని, రాజంపేట ఉమ్మడి పార్టీల అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి చచ్చిన పాములాంటివాడని , అతను పోటీనే కాదని, డిపాజిట్లు కూడ రావని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని కొత్తయిండ్లు, కొత్తపేట, ఎల్‌ఐసీ కాలనీలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేసి రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలని కోరారు. మంత్రి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 అపద్దాల హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేసి, అధికారం రాగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో చేసి ఒక్కటైన అమలు చేశారా..? అంటు నిలధీశారు. 2019 ఎన్నికల పాదయాత్రలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను తూచతప్పకుండ అమలు చేశారని కొనియాడారు. నవరత్నాలు బడుగుబలహీన వర్గాల పాలిట వరమైందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, నివాసంకు అగ్రస్థానం కల్పించడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలనను తీసుకెళ్లి సేవలు అందించడం జరిగిందన్నారు. వలంటీర్లు అందిస్తున్న సేవలు మరువలేనిదన్నారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు సైతం భయపడిన జగనన్న వలంటీర్లు మాత్రం ధైర్యంగా కరోనా రోగులకు సేవలు అందించారని స్పష్టం చేశారు.

 

 

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేసేవి మాత్రమే చెబుతారని , వాటినే మ్యానిఫెస్టోగా విడుదల చేయడం జరిగిందన్నారు. ఐదేళ్లలో 98 శాతం ఎన్నికల హామీలను అమలు చేసి, ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే అర్హత, హక్కు వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉందని పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు , పవన్‌ ల మ్యానిఫెస్టోలో బిజెపి దూరంగా ఉందని ఎద్దెవ చేశారు. రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి చచ్చిన పాములాంటివాడని, అతను తమకు పోటీనే కాదని , డిపాజిట్లు కూడ రాదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఉమ్మడి పార్టీల మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్‌, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Chandrababu is not entitled to ask for votes – Minister Peddireddy

 

Post Midle