చంద్రబాబు లోకల్ కాదు..నాన్‌ లోకల్‌- ఏపీ సీఎం జగన్‌

అమరావతి  ముచ్చట్లు:


ఏపీ సీఎం జగన్‌ కుప్పం నియోజకవర్గంలోని అనిమిగాని గ్రామంలో మూడో విడత వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా అమూల్‌ రంగ ప్రవేశం చేశాక చంద్రబాబు కుటుంబం నడుపుతున్న హెరిటేజ్‌ సంస్థ కూడా ధరలను  పెంచక పరిస్థితిని తీసుకువచ్చామని అన్నారు. జనవరి నుంచి లబ్ధిదారులకు పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు.చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి నాన్‌లోకల్‌ హైదరాబాద్‌కు లోకల్‌ అని అన్నారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 35 సంవత్సరాల పాటు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశాడని, ఏనాడైనా నియోజకవర్గానికి ఎలాంటి మేలు చేయకపోగా ప్రజల నుంచి అనేకంగా లాభపడ్డారని ఆరోపించారు. కుప్పంలో కరువుకు పరిష్కారం చూపలేక పోయాడని దుయ్యబట్టారు.హంద్రీనీవాకు చంద్రబాబు అవరోధంగా మారాడని, తన వాళ్లకు కాంట్రాక్ట్‌లు ఇప్పించి లబ్ధిపొందాడని విమర్శించారు. టీడీపీ హయాంలో చేసిన అప్పుల కన్నా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు చాలా తక్కువని వెల్లడించారు. మహిళల జీవితాల్లో వచ్చిన మార్పులు సమాజానికే మంచి మార్పు అని అన్నారు.

 

Tags: Chandrababu is not local..Non local- AP CM Jagan

Leave A Reply

Your email address will not be published.