Natyam ad

చంద్రబాబుదీ సంఘీభావం కాదు పొత్తు -ఎంపీ రెడ్డెప్ప

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు, జనసేన నాయకుడు పవన్‌కళ్యాణ్‌ను కలవడం సంఘీబావం కాదని, పొత్తుపెట్టుకునేందుకేనని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ఎద్దెవా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడుకు నైతిక విలువలు లేవని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కులేదన్నారు. వైస్‌రాయి హ్గటల్‌లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌టిరామారావును చెప్పులతో కొట్టించింది చంద్రబాబుకు గుర్తులేదా అంటు నిలధీశారు. అలాగే కాపు మహాసభలో ముద్రగడ పద్మనాభంను అరెస్ట్ చేయడం, దాడులు చేయడం గుర్తులేదా అంటు ప్రశ్నించారు. కాపుసంఘ నాయకుడు వంగవీటి మోహన్‌రంగాను హత్యచేయించడం గుర్తులేదా అని ప్రశ్నించారు. ఈ విధంగా అనేక ఘోరాలు చేసిన చంద్రబాబునాయుడుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కులేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నట్లుగా చంద్రబాబునాయుడు పొత్తుల కోసమే డ్రామాలు ఆడుతున్నారని ఎద్దెవా చేశారు. బాబు, పవన్‌కళ్యాణ్‌ మాటలకు ప్రజలు మోసపోరని తెలిపారు. ఎవరితో పొత్తులు పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎవరు ఏమి చేయలేరని స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడటం మానేస్తే మంచిదని డ్రామాలు ఆడటం, తప్పుడు ప్రసాంగాలు ఇవ్వడం మానివేస్తే మంచిదని హితవు పలికారు.

 

Post Midle

Tags: Chandrababu is not solidarity but alliance – MP Reddappa

 

Post Midle