Natyam ad

బీసీలకు సీటు లేకుండ కుప్పం కబ్జాదారు చంద్రబాబు

-ఎన్టీఆర్‌ తరువాత బీసీలకు స్థానం ఇచ్చిది జగన్‌
– నవరత్నాలు బడుగుల సంక్షేమం కోసమే
– ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం.

పుంగనూరుముచ్చట్లు:

Post Midle

ముప్పెఏళ్లుగా బీసీలకు చెందిన కుప్పం నియోజకవర్గాన్ని కబ్జా చేసిన చంద్రబాబునాయుడు బీసీలపై కపటప్రేమ చూపుతున్నాడని, ఎన్టీఆర్‌ తరువాత బీసీలకు అగ్రస్థానం కల్పించి , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పదవులు ఇచ్చిన ఘనత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని , బీసీలకు ఆత్మస్థెర్యం పెంచి , పక్కన కుర్చోబెట్టుకుని , నవరత్నాల పేరుతో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి జగననేనని , ఆయనను బీసీలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం తెలిపారు. గురువారం ఆయన పుంగనూరులో వన్నెకులక్షత్రియ సంఘ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యం మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీసీ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి , బీసీల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయలేదని , ఇక చేయబోరని ఎమ్మెల్సీ తెలిపారు. మాయమాటలతో ఓట్లకోసం వచ్చే తెలుగుదేశం పార్టీ వారిని బీసీలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థి ఎంపీ మిధున్‌రెడ్డి లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీసీలందరు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచి , ప్రతిపక్షాలకు సత్తా చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ జిల్లా అధ్యక్షులు వేలురామ్‌, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు చెంగారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, శంకర్‌రెడ్డి, మునిరెడ్డి, హరి, కిరణ్‌, విజయ్‌, సురేష్‌, లోకేష్‌, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Chandrababu is the occupier of Kuppam as there is no seat for BCs

 

Post Midle