ఆర్ధిక శాఖ అధికారులతో చంద్రబాబు భేటీ

Chandrababu meeting with the finance department officials

Chandrababu meeting with the finance department officials

Date:21/09/2018
అమరావతి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. 15 ఆర్ధిక సంఘానికి ఇవ్వాల్సిన వినతి మీద సమీక్ష చేసారు. స్తున్నారు. విభజన నష్టం నుండి ఇంకా ఏపీ కోలుకోలేదని, భౌగోళిక ప్రాతిపదికన ఆస్తులు పంచి జనాభా ప్రాతిపదికన అప్పులు పంచారని అయినా అన్యాయాన్ని ఇంకా పూడ్చలేదని, పునర్విభజన, ప్రత్యేకహోదా ఇవ్వని అంశాలు, అమరావతికి ఇచ్చిన స్వల్ప నిధులు అన్ని వినతిలో వివరించాలని సూచించారు. 58.32% జనాభా, 46% ఆదాయం ఉండేలా అసమాన విభజన నష్టం పూడలేదు.
విభజన నష్టం నుంచి 4ఏళ్లయినా ఆంధ్రప్రదేశ్ తేరుకోలేదు.  భౌగోళిక ప్రాతిపదికన ఆస్తులు,జనాభా ప్రాతిపదికన అప్పులు పంచారు. 4ఏళ్లు అయినా ఏపి పునర్విభజన చట్టం అంశాలను అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇవ్వలేదు.రాజధాని నిర్మాణానికి ఇచ్చింది అతిస్వల్పం. వెనుకబడిన జిల్లాల అభివృద్దికి అరకొర నిధులు ఇచ్చారు. విభజనకు ముందు 13జిల్లాల రాబడి,ఖర్చుల గురించి సరైన లెక్కలు లేవు.
14వ ఆర్ధిక సంఘం వేసిన అంచనాలు తప్పాయి. కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వ్యవయాధారిత ప్రాంతం.పారిశ్రామిక రంగం రాబడి అతిస్వల్పం.సేవారంగంలో ఆదాయం శూన్యమని అయన అన్నారు. 14వ ఆర్ధిక సంఘం వేసిన అంచనా రాబడి రాలేదు. అంచనాల కన్నా రుణభారం అధికం అయ్యింది. పొరుగు రాష్ట్రం సేవారంగంలో 8% రాబడివృద్ధి ఉంది.అదే ఆంధ్రప్రదేశ్ లో 2% కూడా సేవారంగంలో వృద్ధి లేదు.
సేవరంగంలో ఏపికి రాబడి పెరిగేలా చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే. స్వయంకృషితో 4ఏళ్లలో ఆదాయాలు పెంచుకున్నాం.దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.  ఏపీకి జరిగిన అన్యాయాన్ని పూడ్చేలా సరిఅయిన న్యాయం జరిగేలా చూడాలని ఈ వినతిలో కోరాలని అధికారులకు వివరించారు.
ఎంత కష్టపడ్డా రాష్ట్ర నిర్మాణ సమస్యలే(స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్) ప్రతిబంధకాలు అయ్యాయి.చేయాల్సిన సహాయం కేంద్రం అందించలేదు. నెరవేర్చాల్సిన హామీలు నెరవేర్చలేదు.పునర్విభజన చట్టంలో అంశాలను అమలు చేయలేదు. వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించాం.అయినా పారిశ్రామిక రంగంలో వెనుకబడ్డాం. సేవారంగంలో పూర్తిగా వెనుకంజలో ఉన్నాం. వీటన్నింటినీ పరిష్కరించాల్సిన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ఈ పరిస్థితిలో ఈ సమస్యలను అన్నింటినీ పరిష్కరించాల్సిన  బాధ్యత కేంద్రానిదే. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పురోగతికి బాటలు వేయాల్సిన బాధ్యత 15వ ఆర్ధికసంఘానిదే. కేంద్రం తప్పులకు రాష్ట్రప్రజలను నష్టపరచడం సరైందికాదు. హైదరాబాద్ స్థాయి నగరం నిర్మించాలంటే 20ఏళ్లు పడుతుందని అప్పుడే చెప్పాం.
రూ.5లక్షల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని విభజనకు ముందే చెప్పాం. స్ట్రక్చరల్ ప్రాబ్లెమ్స్ వల్ల తలెత్తిన ఆర్ధికభారం ప్రజలపై మోపడం సరైందికాదు.  స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ నుంచి బైటపడే వరకు ఏపికి ఆర్ధిక సంఘమే చేయూత ఇవ్వాలి. ఇంత ఆర్ధికలోటులో కూడా నదుల అనుసంధానం చేశాం.పోలవరం ప్రాజెక్టు 58%పూర్తిచేశాం.
12ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశాం.రేపు మరో 3ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం.ఏప్రిల్  కల్లా 40ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నాం. వీటన్నింటినీ 15వ ఆర్ధిక సంఘానికి ఇచ్చే నివేదికలో పొందుపరచాలి. అన్ని అంశాలతో ప్రజంటేషన్ రూపొందించాలని అధికారులకు అయన సూచించారు.
Tags:Chandrababu meeting with the finance department officials

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *