చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ఓ కుట్ర: కేశినేని నాని

Chandrababu Nabuelable Warrant A conspiracy: Kesineni Nani

Chandrababu Nabuelable Warrant A conspiracy: Kesineni Nani

Date:14/09/2018
విజయవాడ  ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పోరాడిన చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడం కుట్రలో భాగమేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.శుక్రవారం  విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ అసలు కేసే లేదని చెప్పిన వారు ఇప్పుడు నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన ఆందోళనపై ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు వారెంట్‌ జారీ చేయడం సమంజసం కాదన్నారు.
తెలంగాణ ఎడారి కాకూడదనే చంద్రబాబు అప్పట్లో ఆందోళన చేశారని నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నందునే చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. ఈ కుట్రలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రధాన సూత్రధారులని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగు ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారని.. ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేదని నాని వ్యాఖ్యానించారు.
Tags:Chandrababu Nabuelable Warrant A conspiracy: Kesineni Nani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *