పార్టీలో చేరేవారికి చంద్రబాబు నాయుడు షాక్

అమరావతి ముచ్చట్లు:

 

తెలుగుదేశం పార్టీలో చేరేవారికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నుంచి భారీగా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కుతున్నారు. భవిష్యత్‌లో మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా సరే.. తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పసులు కండువా కప్పుకోవాలని షరతు విధించారు.తెలుగుదేశం పార్టీలో చేరికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరేందుకు ఎవరు సిద్ధమైనా రాజీనామా చేసిన తర్వాతే రావాలని కొత్త షరతు పెట్టారు. వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేరికలు ఉంటాయని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఎంతటి వారైనా విలువలు పాటించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత సూచించారు.ఇక ఇదే విషయాన్ని కేంద్రమంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు కూడా వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన.. వైసీపీ నేతల చేరికలపై స్పందించారు. అభివృద్ధిని చూసి ఎన్డీఏ కూటమిలోకి వచ్చే వారికి ఆహ్వానం పలుకుతామని అన్నారు. అయితే పార్టీలోకి వచ్చే వారు రాజీనామా చేసి వస్తారని రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు. రాజ్యసభలో బలం పెంచుకోవాల్సిన అవసరం తమకు లేదని.. అసెంబ్లీలో తమ పార్టీకి సంఖ్యాబలం ఉందని.. దాంతో రాజ్యసభలో ఏర్పడే ప్రతీ ఖాళీ తమకే దక్కుంతుందని వెల్లడించారు. ఇతర పార్టీల్లోనూ కొందరు మంచి నేతలు ఉన్నారని.. తమ పార్టీలో చేరేవారు పదవులకు రాజీనామా చేసి వస్తే చేర్చుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత.. టీడీపీలో లేదా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలాస తెలుగుదేశం ఎమ్మెల్యే గౌతు శిరీష కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకోవద్దని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఊసరవెల్లి లాంటి నాయకులను పార్టీలోకి తీసుకోవద్దని సూచించారు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లని పార్టీలో తీసుకుంటే.. అధికారం లేనప్పుడు పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్లని అవమానించినట్టే అవుతుందని గౌతు శిరీష పేర్కొన్నారు.

 

Tags: Chandrababu Naidu is a shock to those joining the party

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *