చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న రాజేంద్రప్రసాద్ గారు.

కాణిపాకం ముచ్చట్లు:

వరసిద్ధి వినాయకుని కృపాకటాక్షాలతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్న – వై.వి.బి.రాజేంద్రప్రసాద్.ఈరోజు చిత్తూరు జిల్లా, కాణిపాకం లో స్వయంభు వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న రాజేంద్రప్రసాద్ గారు.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ.శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రజలందరిపై ఉండాలని, ఐదు సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రజలకు జూన్ 4వ తేదీతో మంచి రోజులు రాబోతున్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, అలా జరిగితేనే మన రాష్ట్రానికి, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వినాయక స్వామిని కోరుకున్నట్లు రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఆలయ అధికారులు రాజేంద్రప్రసాద్ గారికి సాదరంగా స్వాగతం పలికి, వేద పండితుల చేత ఆశీర్వాదాలు ఇప్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, చుక్కా ధనుంజయ యాదవ్,కిరణ్,రవి, ప్రకాష్ నాయుడు,కుప్పాల మురళి తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Chandrababu Naidu wanted Rajendra Prasad to become the Chief Minister.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *