చంద్రబాబునాయుడు 40ఏళ్ల రాజకీయ కెరీర్ స్ఫూర్తిదాయకం

Chandrababu Naidu's 40-year-old political career is inspiring

Chandrababu Naidu's 40-year-old political career is inspiring

Date:26/02/2018
అమరావతి ముచ్చట్లు:
రాజకీయం.. ఎక్కడున్నా.. స్వార్ధ ప్రయోజనాల చుట్టూనే తిరుగుతోంది. అధికారమే పరమావధిగా ఎత్తుకు పైఎత్తులు వేసే పార్టీలు, నేతలే కనిపిస్తుంటారు. కానీ పాలిటీతో ప్రజలకు సేవ చేయాలన్న మహోన్నతాశయాలున్న నేతలు అతి కొద్ది మంది ఉన్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉంటారు. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అంతటినీ ప్రజాసేవకే అంకితమిచ్చిన అరుదైన నాయకుడాయన. వ్యక్తి నుంచి జనహృదయ నేతగా ఆయన సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. చంద్రబాబు పనితీరు, రాజకీయ కెరీర్ పరిశీలిస్తే.. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీనే వంట బట్టించుకున్నారు. స్వార్ధ రాజకీయాన్ని దరిచేరనీయలేదన్న విషయం సులువుగానే అర్ధమవుతుంది. ఆయన జీవితం తెరచి ఉంచిన పుస్తకంగా తోస్తుంది. 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు విజయాలే కాదు.. ఆటుపోట్లూ ఎదుర్కొన్నారు. అయినా వెరవలేదు. ఊహించని సంఘటనలు ఎదురయ్యాయని కుంగిపోలేదు. అంతకు రెట్టించిన ఉత్సాహంతో నిలబడ్డారు. నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించారు. సొంత పార్టీయో.. లేక అభిమానులకే కాక.. అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు. వ్యక్తి నుంచి వ్యవస్థగా మారిన అరుదైన నాయకుడు చంద్రబాబు. భారత నాయకగణంలో తనకంటూ ఈ ప్రత్యేకతను ఎలా సంపాదించుకున్నారు? అంటే ప్రజా సంక్షేమం కోసం ఆయన శ్రమించే తత్త్వమే ప్రధాన కారణం. విధి నిర్వహణలో తన పరిధి, స్థాయిని మించి కష్టపడతారు. శరీరం సహకరిస్తుందా లేదా అనేది చూసుకోరు. ఉడుం పట్టుకు మించిన పట్టుతో అనుకున్న పని సాధించేవరకూ విశ్రమించరు. రాజకీయాల్లో అడుగిడిన నాటి నుంచీ చంద్రబాబుది ఇదే తత్త్వం. అందుకే ఆయన కృషీవలుడిగా నిలిచిపోయారు. ఐకనిక్ లీడర్ గా ఉన్నారు. విద్యార్ధి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్న చంద్రబాబు రాజకీయాల్లో అడుగిడిన తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్వయంకృషినే ఆధారంగా చేసుకుని నిజాయితీగా పనిచేశారు. విద్యాభ్యాసం పూర్తి కాకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. నీతినిజాయితీలను ప్రాణంగా భావించే చంద్రబాబు చిరకాలంలోనే కాంగ్రెస్ కు కీలక నేతగా మారారు. 28 ఏళ్ళ వ‌య‌సులోనే చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. చంద్రబాబు పనితీరు మెచ్చి నాటి ముఖ్య‌మంత్రి టంగుటూరి అంజ‌య్య తన మంత్రివ‌ర్గంలో ఆయనకు చోటు కల్పించారు. విధ్యార్థి దశలోనే రాజకీయాలతో మమేకమైన చంద్రబాబు ఏనాడు పదవుల కోసం పరితపించలేదు. పదవులే ఆయన్ని వరించాయి. ఏ సంక్షోభం వచ్చినా కుదేలైపోలేదు. చిరునవ్వుతోనే కష్టాలను ఎదుర్కొన్నారు. మరింత బలోపేతమయ్యారు. తన విజయాలను చూసి ఆయన ఎప్పూడు పొంగిపోలేదు. ఆయన అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్నే నమ్ముకున్నారు. అందుకే రాష్ట్రంలోనే కాదు.. దేశరాజకీయాల్లోనే అరుదైన నేతగా మన్ననలందుకుంటున్నారు.
Tags: Chandrababu Naidu’s 40-year-old political career is inspiring

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *