11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబు సన్నాహాలు?

Date:16/03/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
ఎన్డీయే నుండి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతకు పదును పెట్టాడు.ఈ నేపద్యం లో ఎన్డీయేకు చెక్ పెట్టేందుకు ముమ్మర యత్నాలు జరుగుతున్నట్లు ఓ జాతీయ ఛానల్ కథనం పేర్కొంది. 11 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వచ్చే నెలలో మహానాడు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. యునైటెడ్ ఫ్రంట్ మొదటి సమావేశం వచ్చే నెల 7 న జరుగుతుందని పేర్కొంది. శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్), మమత బెనర్జీ (టీఎంసీ), మాయావతి (బీఎస్‌పీ), స్టాలిన్ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ),ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), నవీన్ పట్నాయక్ (బీజేడీ), ఓం ప్రకాశ్ చౌతాలా (ఇండియన్ నేషనల్ లోక్‌దళ్), అసోం గణపరిషత్ (ఏజీపీ)లతో చంద్రబాబునాయుడు మాట్లాడినట్లు ఆ కథనం పేర్కొంది.కాగా తెలంగాణా ముఖ్య మంత్రి థర్డ్ ఫ్రంట్ పెడుతానని పెర్కొనడం దానికి జాతీయ పార్టీల నేతలు మద్దతిస్తున్నారని చెప్పుకొని ఆబాసుపలైన విషయం తెలిసిందే.
Tags: Chandrababu preparations for creation of United Front with 11 parties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *