ఈనెల 20 న చంద్రబాబు నిరసన దీక్ష

Date:17/04/2018
అమరావతి  ముచ్చట్లు:

‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ఈనెల 20న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల తరఫున ‘ధర్మ పోరాట దీక్ష’కొనసాగుతుంది. ఆరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల పాటు దీక్ష కొనసాగనున్నది. తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని, ఆ రోజంతా నిరాహారంతో దీక్ష కొనసాగించి నిరసన తెలియచేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. పుట్టినరోజు నాడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం నిరసన దీక్ష చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.  రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ఈనెల 30న తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభ కుడా నిర్వహించనున్నారు. ‘నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో బహిరంగ సభ జరగనుంది. కాగా, ఈ దీక్షపై చర్చించేందుకు అమరావతి సచివాలయంలోని మంత్రి కళా వెంకట్రావు ఛాంబర్‌లో మంత్రులు దేవినేని, లోకేశ్‌, కొల్లు రవీంద్ర, ఆనందబాబు సమావేశం నిర్వహించారు.

Tags:Chandrababu protest action on 20th of this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *