Natyam ad

చంద్రబాబు రాయలసీమ ద్రోహి

తిరుపతి ముచ్చట్లు:


రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన జరిగింది.  ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ కర్నూలును న్యాయ  రాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించావచ్చు. రాయల సీమకు శ్రీ సిటీ తెచ్చింది వైఎస్ఆర్. రాయలసీమను రతనాల సీమగా మార్చే సత్తా జగనన్నకే ఉంది. చంద్రబాబు రాయల సీమ ద్రోహి. కర్నూలులో హైకోర్టు సాధనే లక్ష్యంగా ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నాం. రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారు. పిల్లనిచ్చిన మామకు.. గద్దెనెక్కించిన సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. మూడు  రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. రాయలసీమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే మొనగాడు వైఎస్ జగనని అయన అన్నారు.

 

Tags: Chandrababu Rayalaseema traitor

Post Midle
Post Midle