దెందులూరులో చంద్రబాబు రోడ్ షో
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడు రోడ్ షో బుధవారం కొనసాగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరైయారు. కలపర్రు టోల్ ప్లాజా నుంచి కొద్దిసేపు ప్రచార రథం పైనుంచి అయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భారీ సంఖ్యలో పార్టీ నేతలు చంద్రబాబు కాన్వాయ్ ను అనుసరిస్తూ వచ్చారు. చంద్రబాబు కాన్వాయ్ చుట్టూ భారీ బైక్ ర్యాలీ చేసారు. చంద్రబాబును చూసేందుకు నేషనల్ హైవే కి అటూ ఇటూ స్థానికులు, మహిళలు నిలబడ్డారు. వారికి అభివాదం చేసుకుంటూచంద్రబాబు ముందుకు సాగారు.
Tags: Chandrababu road show in Denduluru

