కోవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని చంద్రబాబు సాధన దీక్ష

అమరావతి ముచ్చట్లు :
కోవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని సాధన దీక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో  చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా దివంగత నేత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి… ఆపై టీడీపీ అధినేత దీక్షలో కూర్చుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు దీక్ష చేయనున్నారు. 12 డిమాండ్ల పరిష్కారానికి సాధన దీక్షకు దిగారు. ప్రతి తెల్ల రేషన్‌ కార్డు కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలన్నారు. కరోనా తీవ్రత కొనసాగినంతకాలం నెలకు రూ.7,500 అందించాలని డిమాండ్ చేశారు.కరోనా మృతుల కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సాయం  అందించాలని అన్నారు. ఆక్సిజన్‌ మరణాలన్నిటికి ప్రభుత్వానిదే బాధ్యత కాబట్టి వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ. 50 లక్షలు అందించాలని అన్నారు. జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా  గుర్తించి వారికి బీమా సౌకర్యం కల్పించాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, ప్రజలందరికీ వ్యాక్సిన్ లను ఉచితంగా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, రానానాయుడు యనమల, సోమిరెడ్డి, చినరాజప్ప, ఫరూక్, వర్ల, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర,  అనగాని, బోండా, అనిత, బీదా రవిచంద్ర, మంతెన సత్యన్నారాయణ రాజు, టీడీ జనార్దన్, గుమ్మడి సంధ్యారాణి, అశోక్ బాబు తదితరులు  దీక్షలో పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Chandrababu Sadhana Deeksha to support Kovid victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *