చంద్రబాబు కోర్టుకు రావాల్సిందే

Chandrababu should come to court

Chandrababu should come to court

Date21/09/2018

ధర్మాబాద్ ముచ్చట్లు :

బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపున కోర్టుకు హాజరైన అడ్వకేట్ సుబ్బారావు రీకాల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా రీకాల్ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాబాద్ కోర్టు చంద్రబాబు సహా 16 మంది కోర్టుకు హాజరుకావల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు అయ్యింది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాబాద్ కోర్టు ప్రకటించింది.

ఎవరీ సంస్థ ఛైర్మన్ తో మంత్రి లోకేష్ భేటీ

Tags: Chandrababu should come to court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *