చంద్రబాబు… అప్పుడు కరెంట్ ఎందుకు ఇవ్వలేదు

Chandrababu ... then the current is not given

Chandrababu ... then the current is not given

Date:26/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
70 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రపంచ మేధావులమని చెప్పుకునేవాళ్లు సమైక్య పాలనలో కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలన్నారు. పొరపాటున కూటమికి అధికారం కట్టబెడితే.. తెలంగాణ బతుకులు మళ్లీ ఆగమవుతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఎన్ని జెండాలు, ఎన్ని పార్టీలొచ్చినా.. ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సోమవారం (నవంబర్ 26)న కామారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్థన్ తరపున.. ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు, కూటమి టార్గెట్‌గా మరోసారి నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని.. ప్రపంచ మేధావనని చెప్పుకునే చంద్రబాబు కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కేసీఆర్. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్.. 17 ఏళ్లు పాలించిన టీడీపీ హయాంలో కరెంట్ ఎలా ఉందో.. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు.
పెద్ద, పెద్ద మాటలు చెప్పే కాంగ్రెసోళ్లు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలన్నారు. పైగా ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై దుష్ప్రచారం చేయలేదా అని ప్రశ్నించారు. ‘కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టి చూపించారు. తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు.. కరెంట్ సమస్యలొస్తాయన్నారు. తెలంగాణవాళ్లు తెలివితక్కువోళ్లు.. ఆంధ్రావాళ్లు మేధావులన్నారు. ధైర్యంగా చెబుతున్నా.. దేశం మొత్తంలో తెలంగాణలో మాత్రమే ఉంది తలసరి విద్యుత్ వినియోగంలోనెంబర్ వన్ ఉందని గర్వంగా చెప్పగలుగుతున్నా.. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ఈ మాట చెప్పింది. ఇప్పుడు ఎన్నికల్లో నోట్ల కట్టలు, చీప్ లిక్కర్ బాటిళ్లతో వస్తారు జాగ్రత్త. పొరపాటున ఓటు వేసేమనుకో బతుకులు ఆగమే’అని హెచ్చరించారు.
‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ రాదు.. మళ్లీ ఆగమవుతాం. ఇప్పుడు వస్తున్న 24 గంటల కరెంట్‌తో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఆగమైతది. మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు కొనుక్కోవాలి. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి 35 లేఖలు రాశారు. అనేక కేసులు వేశారు. ఇలాంటి వారికి ఎట్ల ఓటేస్తారో ఆలోచించాలి. టీఆర్‌ఎస్ చేసిన పనులు నిజమైతే ఓటు ద్వారా ప్రజలు చెప్పాలన్నారు’కేసీఆర్. ఎన్నికలు వస్తాయి.. చాలా పార్టీలు, జెండాలు, అభ్యర్థులు వస్తారు. ప్రజలు ఆగం కావొద్దు.. అందరు చెప్పేది వినాలి.. ఇంటికెళ్లాక చర్చ పెట్టాలి.. ఏం చేస్తే మనకు లాభమో చర్చించాలి.. ప్రజాస్వామ్యంలో పార్టీలు గెలవడం ముఖ్యం కాదు.. నేతలు గెలవడం కాదు.. ప్రజాస్వామ్యంలో ప్రజలు, అభీష్టం గెలవాలి..ఇంకెన్ని రోజులు ఆగమవుతాం. అమాయకుల్లా ఉంటే కష్టం..
మనం నోరు మూసుకుంటే తెలంగాణ వచ్చేదా.. ఎన్నో ఉద్యమాలు చేశాం.. తిరగబడ్డాం కాబట్టే రాష్ట్రం వచ్చింది వచ్చింది కాబట్టి మనం స్వపాలన చేసుకోగలుగుతున్నాం’అన్నారు. సమైక్య పాలనలో బీడీ కార్మికులకు పట్టించుకున్నారా.. ఆ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్‌ది. రైతు బంధు, రైతు బీమాతో ధీమా ఇస్తున్నాం.. మళ్లీ గెలిస్తే ఫించన్లు కూడా పెంచుతాం. గోవర్థన్ ఎమ్మెల్యే.. కేసీఆర్ సీఎం కాకపోతే కామారెడ్డి జిల్లా అయ్యేదా. గెలిపించమన్నా జిల్లా చేస్తానన్నా చేశా.. జిల్లా అయితే అన్నీ వస్తాయి.. రైలు ఉంది, భగీరథ ద్వారా మంచినీళ్లు తెచ్చాం.. కావాల్సింది సాగు నీరు.. ఈసారి గెలిపిస్తే లక్షా 50వేల ఎకరాలకు నీళ్లు పారిస్తాం.. మెడికల్ కాలేజీ ఇస్తాం.. పీజీ సెంటర్‌ను పెడతాం.. గంప గోవర్థన్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు’. . నిజామాబాద్ జిల్లా గిరిజన సోదరులకు ఒకటే చెబుతున్నా. ఈ ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వస్తది.
ఏర్పాటైన ఆర్నెళ్లలోపే మీ భూములకు కూడా పట్టాలు ఇస్తా. రైతు బంధు పథకం అమలయ్యేలా చేస్తాం. ఇవాళ తెలంగాణలో అన్ని రంగాల్లో ముందుకుపోతూ ఉన్నది. బాజిరెడ్డి గోవర్దన్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఇప్పుడు రైతుబంధు కింద ఎకరానికి మొత్తం రూ.8 వేలు ఇస్తున్నాం. మళ్లీ మేము గెలిస్తే ఎకరానికి రూ.10 వేలు అందిస్తాం. నేనూ రైతునే. నాకు 60ఎకరాల పొలం ఉంది. ఆరునూరైనా సరే భవిష్యత్తులో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతా. ఇవాళ రైతు భీమా కింద గుంట భూమి ఉన్న రైతులు చనిపోయినా రూ.5లక్షల భీమా అందిస్తున్నాం. గీత కార్మికుల బాధను గత పాలకులు పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెట్లపై పన్నును రద్దు చేసింది. తెలంగాణ ఎలాగైతే తెచ్చానో అలాగే గిరిజన, మైనారిటీ రిజర్వేషన్లు తీసుకొస్తామని’ హామీ ఇచ్చారు.
Tags:Chandrababu … then the current is not given

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *