21, 22 తేదీల్లో చంద్రబాబు టూర్

విజయవాడ ముచ్చట్లు:


తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 21, 22 తేదీల్లో గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద…తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఈ నెల 21, 22 తేదీల్లో గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. ముందుగా రాజమహేంద్రం  వెళ్లి అక్కడి నుంచి వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తారు. కాగా, విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించాలనుకుంటున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్లే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గోదావరి వరద  ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందడం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలపై సీఎం జగన్ సీరియస్ గా లేరని మండిపడ్డారు. క్యాబినెట్‌, అధికార యంత్రాంగం కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని చెప్పారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పటికీ కనీసం వరద సమాచారం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

 

 

 

గతంలో ఉన్న విపత్తు నిర్వహణ వ్యవస్థలను జగన్‌ నాశనం చేశారన్న చంద్రబాబు.. పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  ఏరియల్‌ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వర్యం బ్యారేజీ, లంక గ్రామాల్లోని పరిస్థితులను పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి బాధిక కుటుంబానికి రూ.2వేలు ఆర్థిక సహాయం, నిత్యవసరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు.. యానాం లో వరద ఏ మాత్రం తగ్గడం లేదు. పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో గౌతమీ పాయ కారణంగా వరద నీరు పోటెత్తింది. అంతే కాకుండా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 25 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా గోదావరికి  చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి.

 

Tags: Chandrababu tour on 21st and 22nd

Leave A Reply

Your email address will not be published.