చంద్రబాబు ఓడిపోవాలని కోరుకుంటా 

Developments brought to the country: CM Chandrababu

Developments brought to the country: CM Chandrababu

Date:13/06/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తనకు మోకాళ్ల నొప్పి ఉందని, అయినా తను తిరుమల కొండకు కాలి బాటన ఎక్కి వెళ్తానని.. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలని శ్రీవారిని కోరుకుంటానని ప్రకటించారు టీడీపీ బ‌హిష్కృత‌ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఆలేరులో బుధవారం ప్రెస్‌మీట్ పెట్టిన మోత్కుపల్లి బాబుపై మరోసారి ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ తక్షణం ఎన్టీఆర్ కుటుంబీకులకు అప్పగించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్నది దుర్మార్గపు తెలుగుదేశం పార్టీ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఏపీని అవినీతిమయం చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు దొరికిన దొంగలు అని మోత్కుపల్లి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నది వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌లే అని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు నాయుడుకు ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చిత్తశుద్ధి లేదని అన్నారు. కాపులకు- బీసీలకు చంద్రబాబు గొడవ పెట్టారని, బ్రహ్మణుల్లో బ్రహ్మణులకు కూడా గొడవ పెట్టారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పదని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. టీడీపీని నందమూరి కుటుంబీకులకు అప్పజెప్పలని లేకపోతే బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
Tags:Chandrababu want to lose

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *