అచ్చెన్నాయుడి ఆరెస్టును ఖండించిన చంద్రబాబు

Date:11/09/2019

అమరావతి ముచ్చట్లు:

టిడిపి బిసి,ఎస్సీ నేతలను అరెస్టులను మాజీ ముఖ్యమత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు.  పోలీసుల వ్యవహార శైలిని చంద్రబాబు తప్పుపట్టారు. నన్ను కలవడానికివచ్చిన నేతలపై ఇంత దురుసుగా వ్యవహరిస్తారా..?  బాధితులకు న్యాయం చేయమని అడిగేవారిపై ఇన్ని దౌర్జన్యాలా..? శాంతియుతంగా నిరసనలను చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని నిలదీసారు.

 

 

 

టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడు పట్ల అమర్యాదగా వ్యవహరిస్తారా..? బిసి నేతలు దువ్వారపు రామారావు, జగదీష్ లను అవమానిస్తారా..? టిడిపి ఎస్సీ నేత మాజీ మంత్రి జవహర్ పట్లఅనుచితంగా ప్రవర్తిస్తారా..?  మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి..ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతారని ప్రశ్నించారు.

మేమేమీ యుద్ధానికి వెళ్లట్లేదు : అచ్చెన్నాయుడు

Tags: Chandrababu, who denounced Archana’s Arest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *