ఆంద్రప్రదేశ్‌ను అవినీతి ప్రదేశ్‌గా మార్చిన చంద్రబాబు

Chandrababu, who transformed Andhra Pradesh into corruption

Chandrababu, who transformed Andhra Pradesh into corruption

– మోత్కుపల్లి ధ్వజం
Date:13/06/2018
యాదాద్రి భువనగిరి  ముచ్చట్లు:
 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ భహిష్ కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నడిపే టీడీపీ దుర్మార్గపు పార్టీ అని నిప్పులు చెరిగారు. ఆంద్రప్రదేశ్‌ను చంద్రబాబు అవినీతి ప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లా ఆలేరులో మోత్కుపల్లి బుధవారం విలేకరులతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి లేనని, వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతోంది వైఎస్‌ జగన్, పవన్ కల్యాణ్‌ అని, చంద్రబాబు కాదని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కాపులకు, బీసీలకు, బ్రాహ్మణులకు చంద్రబాబు గొడవ పెట్టారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. ఈ వ్యవస్థలోని చీడ పురుగు చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలని, లేకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘నాకు మోకాళ్ళ నొప్పి ఉంది. అయినా కూడా తిరుపతి మెట్లు ఎక్కి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటా’ అని మోత్కుపల్లి అన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెబుతారని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జగన్‌తో కుమ్మక్కయ్యానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న మోత్కుపల్లి, తానే చంద్రబాబును ఓడించమని చెబుతున్నానన్నారు. ఆలేరు ప్రజల కోరిక మేరకు తాను వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆలేరు నుంచి బరిలోకి దిగుతానన్నారు. తెలంగాణలోని టీడీపీ కార్యకర్తలుఅభిమానులు స్వచ్చందంగా పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసి తనకు మద్దతుగా నిలుస్తున్నారని మోత్కుపల్లి చెప్పుకొచ్చారు.
Tags: Chandrababu, who transformed Andhra Pradesh into corruption

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *