చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి

Chandrababu words are going beyond the castles

Chandrababu words are going beyond the castles

Date:31/12/2018
విజయనగరం ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటు తున్నాయి. మోడి ఒడిలో కూర్చుని నవ నిర్మాణ దీక్ష చేసి తరువాత  కాంగ్రెస్ తో కలిసాక చేస్తున్న దర్మపోరాట దీక్ష చూసి ప్రజలు తల దించి కుంటున్నారని వైకాపా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి విమర్శించారు. చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య కక్షలలో జగన్,  వైఏస్ ని లాగడం హాస్యాస్పదమని అయన అన్నారు. చంద్ర బాబు తాను చేస్తున్న తప్పులను తప్పించుకోడానికి ఆంధ్రా ప్రజలందరిని వాడుకుంటున్నారు. నాలుగు సంవత్సరాల పాలనపై  శ్వేత పత్రం విడుదల చేస్తున్న సియం,  ఎన్నికల హామీలు, ప్రాజెక్ట్ ల పై శ్వేత పత్రం విడుదల చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు. మోడీతో మమ్మల్ని అంట గలిపి రాజకీయ ప్రయోజనం పొందాలని సియం చూస్తున్నారు. తెలంగాణాలో పార్టీలు మారిన వారిని చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు ఏపీలో ఆ పిలుపు ఇవ్వగలరాఅని నిలదీసారు. మోడి పై పోరాడ లేక బయపడి ఇక్కడ జగన్ పై విమర్శ లు చేస్తూ మోడితో లింక్ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Tags:Chandrababu words are going beyond the castles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed