కుప్పం ఘటనలపై చంద్రబాబు మండిపాటు

చిత్తూరు ముచ్చట్లు:

కుప్పంలో తలెత్తిన పరిణా మాలపై టిడిపి అధినేత చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నామని చంద్రబాబు ప్రకటించారు.పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించకుంటే ప్రజా తిరుగు బాటు ఖాయమని చంద్రబాబు హెచ్చ రించారు.కుప్పంలో తన రెండో రోజు పర్యటనకు వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేయడం, టిడిపి ఫ్లెక్సీల చించివేయడంపై చంద్ర బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బస్టాండ్ వద్ద రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ తప్పు చేసిన పోలీసు లను దోషులుగా నిలబెడతామమని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పం ప్రజలెప్పుడూ ప్రశాంత జీవితం గడి పారని,ఎప్పుడూ ఈ తరహా దాడులు కుప్పంలో చూడలేదని.. ఈ పోలీసుల కంటే బ్రిటీష్ వాళ్లే నయమని వ్యాఖ్యా నించారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకో లేకే వైకాపా ఈ తరహా ఘటనలకు పాల్పడుతోందన్నారు.వైసీపీ పతనానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని.. కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలుకు తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

 

Tags: Chandrababu’s anger over the Kuppam incidents

Leave A Reply

Your email address will not be published.