చంద్రబాబువి బురద రాజకీయాలు

నరసాపురం ముచ్చట్లు:


గత టిడిపి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేయడం వల్లే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రత్నాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తారని ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారన్న సంగతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికారులు తీవ్ర కృషి చేసి సహాయక చర్యలు అందించి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే చంద్రబాబు బురద రాజకీయాలు చేయడానికి పాలకొల్లు నియోజకవర్గం లో పర్యటించడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ రాజు పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, రావూరి వెంకటరమణ, గుంటూరు పెద్దిరాజు, చిట్టూరి కనకమహాలక్ష్మి ఏడుకొండలు, పొత్తూరి బుచ్చిరాజు, పెండ్ర వీరన్న తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Chandrababu’s mud politics

Leave A Reply

Your email address will not be published.