Natyam ad

‘చంద్రబాబు సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయలేని ఓ భూటకం!’

-వాస్తవ గణాంకాలతో ప్రజలకు వివరించిన సీఎం జగన్

-సీఎం జగన్: చంద్రబాబు తన సూపర్ 6కి నిధులు ఎలా సమకూరుస్తారో.. చెప్పగలరా?

-“సీఎం జగన్

 

Post Midle

పులివెందుల ముచ్చట్లు:

చంద్రబాబు ఇటీవలే సూపర్ 6 అంటూ కొన్ని వాగ్దానాలు చేశారు. ప్రస్తుతం మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా చంద్రబాబు చెప్పిన ఈ పథకాలను అమలు చేయడానికి అయ్యే ఖర్చును లెక్కించాలని నేను ఆర్థిక శాఖను కోరాను. ప్రస్తుతం అమలు అవుతున్న పథకాల్లో కింది పథకాలు ఏ మాత్రం తొలగించలేని చాలా కీలకమైనవి”. ఆ పథకాలు ఇవే..

1. రూ. 24,000 కోట్లతో 66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్
2. రైతులకు రూ. 11,000 కోట్లతో ఉచిత విద్యుత్
3. రూ. 4,600 కోట్లతో PDS కింద రేషన్ పంపిణీ
4. రూ. 4,400 కోట్లతో ఆరోగ్యశ్రీ/ఆసరా/104/108 కింద ప్రజా ఆరోగ్య సంరక్షణ
5. రూ. 5,000 కోట్ల ఖర్చుతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విద్యా దీవెన & వసతి దీవెన
6. రూ. 2,200 కోట్ల వ్యయంతో సంపూర్ణ పోషణ
7. రూ. 1,900 కోట్ల ఖర్చుతో గోరుముద్ద

మొత్తంగా ఈ పథకాల కోసం మన ప్రభుత్వం సుమారు రూ. 52,700 కోట్లు ఖర్చు చేస్తోంది.

‘చంద్రబాబు చెప్పిన ‘సూపర్ 6’ వాగ్దానాల ఖర్చు రూ.73,440 కోట్లు, దానిని అమలు చేయలేరని ఆయనకు తెలుసు. దీనికి తోడు ఇటీవల చెప్పిన బీసీలకు పెన్షన్‌ కోసం అదనంగా రూ.13,872 కోట్లు ఖర్చవుతుంది. అంటే బాబు ‘సూపర్‌ 6’ + 1 (బీసీ పెన్షన్‌) కోసం ఏడాదికి మొత్తం రూ.87,312 కోట్లు ఖర్చవుతుంది.’

‘ఈ ఖర్చును ప్రస్తుతం అమలవుతున్న కీలకమైన పథకాల ఖర్చుకు జోడిస్తే మొత్తం పథకాల అమలుకు గాను రూ. 1.4 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.”పరిపాలనలో అద్భుత సంస్కరణలు తీసుకొచ్చి, అవినీతిని నిర్మూలించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏడాదికి రూ. 75,000 కోట్ల విలువైన సంక్షేమ ప్రయోజనాలను (DBT & నాన్-డిబిటి) ప్రజలకు అందించింది. కానీ చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే ఏటా రూ.1.4 లక్షల కోట్లు కావాలి. ఈ నిధులను ఎలా తెస్తారనే ప్రశ్నకు చంద్రబాబు వద్ద సమాధానం ఉందా? చంద్రబాబు చెబుతున్న ఈ వాగ్దానాలు ఆచరణ సాధ్యం కాదని అసెంబ్లీలో సవివరమైన చర్చ కూడా జరిగింది.’: సీఎం జగన్.

 

Tags: ‘Chandrababu’s Super 6 promises are a nightmare!’

Post Midle