లంక గ్రామాల్లో చంద్రబాబు పర్యటన
ఆచంట ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లాఆచంట మండలంలోని పలు లంక గ్రామాల్లో వరద బాధితులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. గోదావరి నదిలో పంటులో ప్రయాణించి వరద ముంపు గ్రామాలు అయిన అయోధ్యలంక,మర్రిమూల గ్రామాలలో ట్రాక్టర్ పై ఎక్కి చంద్రబాబు పర్యటించారు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తనను వరద ముంపు బాధితుల కష్టాలు తీవ్రం గా బాధించాయన్నారు. ప్రజలను బురదలో ముంచేసి సీఎం గాల్లో తిరుగుతున్నాడని విమర్శించారు.వరద ముంపు బాధితులను ఆదుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. 1500 కిలోమీటర్లు గోదావరి ప్రయాణించి ఇక్కడికి వస్తుంది కానీ వరదకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చెయ్యలేదని,బాధ్యత గల సీఎం అయితే వరద ముంపు ప్రాంతాలను రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిక్కుమాలిన చెత్త ప్రభుత్వం అని 1571 మందికి ఒక్క పడవ చొప్పున కేటాయించి తరలించారు. ఇదేనా సన్నద్ధతా అని ప్రశ్నించారు.నేను వస్తున్నా అని చెప్పి ఇప్పుడు రెండు వేలు ఇచ్చారని ,కుటుంబానికి నాలుగుఉల్లిపాయలు,నాలుగు మిరపకాయలు ఇచ్చిన ప్రభుత్వం ఇదన్నారు. పశ్చిమ గోదావరి లో కూరగాయలు,
తమలపాకు తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని,తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు 10 వేలు ఇస్తుంటేరాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.నష్ట పరిహారం రెండు వేలు ఇచ్చే ఈ ప్రభుత్వానికి అసలు బుద్ది ఉందా అని అన్నారు.అయోధ్య లంక ప్రాంతం లోతమ ప్రభుత్వం రాగానే బ్రిడ్జి నిర్మిస్తాం.అని హామీ ఇచ్చారు.ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించి మంచి నీరు ఇస్తాం అన్నారు. దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల సాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.దద్దమ్మ సీఎం న్యాయం చెయ్యడం లేదని పోలవరం ముంపు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలి అంటున్నారు అన్నారు.రాష్ట్రంలో దళితులను జగన్ ప్రభుత్వం వేధిస్తుందని మహాసేన రాజేష్ పై అక్రమ కేసులు పెట్టారన్నారు రాష్ట్రం లో దళితుల పథకాలు తీసేసి అన్యాయం చేశారని అయన విమర్శించారు.

Tags: Chandrababu’s visit to Lankan villages
