వైభవంగా చంద్ర‌గిరి  శ్రీ కోదండరాముడి చక్రస్నానం

Chandragiri Sri Kodandaramudy Chakrasanam is the exquisite glory

Date:23/04/2019

చంద్ర‌గిరి ముచ్చట్లు:

చంద్ర‌గిరిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన మంగ‌ళ‌వారం ఉదయం ఆల‌య ప్రాంగ‌ణంలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు వ‌సంతోత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో  సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు చేశారు.  అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

అనంత‌రం  రాత్రి 8.00 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

కాగా, ఏప్రిల్ 24వ తేదీ బుధ‌వారం సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టాభిషేకం వైభవంగా జరుగనుంది.

 

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  సుబ్ర‌మ‌ణ్యం, ఏఈవో నాగ‌రాజు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ శ్రీ‌నివాస భ‌ట్టార్‌, ప్ర‌ధాన కంక‌ణ భ‌ట్టార్  కృష్ణ భ‌ట్టార్‌,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ చైత‌న్య‌, ఇతర అధికారులు, విశేష‌ భక్తులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్‌

Tags:Chandragiri Sri Kodandaramudy Chakrasanam is the exquisite glory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *