చంద్రన్నా …. మీమాల్‌ ఎక్కడన్నా…

Chandranna .... where is somal ...

Chandranna .... where is somal ...

Date:10/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను విక్రయిస్తామంటు ఏర్పాటు చేసిన చంద్రన్నమాల్స్ అడ్రస్సులేకుండ పోయింది. చంద్రన్నమాల్స్ పేరుతో ఏర్పాటు చేసిన సూపర్‌ బజార్లు అనుకున్న గోల్‌ను స్యాధించలేక బోర్లపడ్డాయి. మూడునాళ్ళ ముచ్చటగా మూసివేశారు. పుంగనూరు పట్టణంలోని తూర్పువెహోగశాలలో గల ఎస్‌బిఐ ఎదురుగా చంద్రన్నమాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి సక్రమంగా సరుకులు రాకపోవడం, సరుకులు సరైన నాణ్యత లేక నిర్వాహకులకు ఆశించిన మేరకు ఆదాయం లేకపోవడంతో చంద్రన్నమాల్స్ను ఆరు నెలలుగా మూసివేశారు. ఆడిట్ల పేరుతో ఉన్న సరుకును తీసుకెళ్లారు. అలాగే నిర్వాహకులకు సరైన సమాచారం లేకపోవడంతో భవనాలకు అద్దె చెల్లించలేక నిర్వాహకులు లబోదిబో మంటున్నారు. ఆరు నెలలైనా సరుకులు రాకపోవడంతో చంద్రన్న మాల్స్ గురించి ప్రజలు మరచిపోయారు. ప్రభుత్వం ఆనాలోచిత చర్యలకు నిదర్శంగా చంద్రన్నమాల్స్ నిలుస్తోందని ప్రజలు వాపోతున్నారు.

 

మూగరోదన  

Tags: Chandranna …. where is somal …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *