పుంగనూరులో ఆర్‌అండ్‌బి ఇన్‌చా ర్జ్ డి ఈ గా చంద్రశేఖర్
పుంగనూరు ముచ్చట్లు:
రోడ్లు మరియు భవనముల శాఖ ఇన్‌చా ర్జ్ డి ఈ గా ఏ చంద్రశేఖర్ పుంగనూరు ఆర్ అండ్ బి కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సబ్ డివిజన్లో జె ఈగా పనిచేస్తూ బదిలీపై పుంగనూరుకు రావడం జరిగింది. పుంగనూరు ఆర్ అండ్ బి డి ఈ గా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు డివిజన్ పరిధిలోని ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు. ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్న వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇంచార్జ్ డి ఈ కి పలువురు కాంట్రాక్టర్లు అభినందనలు తెలిపారు.
Tags: Chandrasekhar as R&B Incharge, Punganur

