Chandrayaan on July 15

Chandrayaan on July 15

Date:12/06/2019

తిరుపతి ముచ్చట్లు:

చంద్ర‌యాన్‌-2 ప్ర‌యోగం కోసం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. బెంగుళూరు శాటిలైట్ ఇంటిగ్రేష‌న్ అండ్ టెస్టింగ్ సెంట‌ర్‌లో చంద్ర‌యాన్‌-2 కు సంబంధించిన ప‌రికరాలు సిద్ధం అవుతున్నాయి. చంద్ర‌యాన్‌-2కు చెందిన ఫోటోల‌ను ఇవాళ ఇస్రో రిలీజ్ చేసింది. జూలై 9 నుంచి 16 మ‌ధ్య చంద్ర‌యాన్‌-2 మిష‌న్‌ను ప్ర‌యోగించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం జూలై 15వ తేదీన ఏపీలోని శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-2ను ప్ర‌యోగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 2019 సెప్టెంబ‌ర్ 6న అది చంద్రుడిపై దిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఆర్బిటార్‌, ల్యాండ‌ర్‌(విక్ర‌మ్‌), రోవర్‌(ప్ర‌జ్ఞన‌) మాడ్యూళ్ల‌ను చంద్ర‌యాన్‌2 ద్వారా లాంచ్ చేయ‌నున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా ప్ర‌యోగం జ‌రుగుతుంది. ఆర్బిటార్ ప్రొప‌ల్‌ష‌న్ మాడ్యూల్ ద్వారా మూన్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ ప్ర‌వేశిస్తుంది. ఆ త‌ర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంది. చంద్రుడిపైన ఉన్న ద‌క్షిణ ద్రువంలో ల్యాండర్ దిగుతుంది. ఇక శాస్త్రీయ ప‌రీక్షల కోసం రోవ‌ర్ అక్క‌డ సంచ‌రిస్తుంది. ల్యాండ‌ర్‌, ఆర్బిటార్ మాడ్యుళ్ల‌లో ప‌రిక‌రాల‌ను శాస్త్ర‌వేత్త‌లు బిగించారు. చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగం ద్వారా 11 పేలోడ్స్ కూడా తీసుకువెళ్ల‌నున్నారు. ఇందులో ఇండియాకు చెందిన‌వి ఆరు, యూరోప్‌వి మూడు, అమెరికావి రెండు ఉంటాయి.

 

 

 

 

 

 

 

 

2009లో చంద్ర‌యాన్ 1ను ఇస్రో ప్ర‌యోగించిన విషయం తెలిసిందిభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రగ్రహంపైకి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగానికి సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III వాహకనౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని ద్వారా చంద్రగ్రహంపైకి ఆర్బిటార్‌, ల్యాండ‌ర్‌, రోవర్‌‌ను ప్రవేశ పెట్టనున్నారు. ల్యాండర్‌కు ‘విక్రమ్’ అని, రోవర్‌కు ‘ప్రగ్యాన్’ అని నామకరణం చేశారు. జులై 15న వేకువజామున 2.51 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించారు. 2019 సెప్టెంబ‌ర్ 6న చంద్రయాన్-2 రోవర్ చంద్రుడిపై దిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఆర్బిటార్ ప్రొప‌ల్షన్ మాడ్యూల్ ద్వారా చంద్రయాన్-2 శాటిలైట్‌ను చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. ఆ త‌ర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంది. చంద్రుడిపై ఉన్న ద‌క్షిణ ధ్రువంలో ల్యాండర్ దిగుతుంది. అనంతరం శాస్త్రీయ ప‌రీక్షల నిమిత్తం చంద్రగ్రహంపై రోవ‌ర్ సంచ‌రిస్తుంది.ఈ ప్రయోగం ద్వారా మొత్తం 13 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భారత్‌కు చెందిన‌ 6, యూరోప్‌కు చెందిన 3, అమెరికాకు చెందిన 2 పేలోడ్స్ ఉన్నాయి. చంద్రయాన్-2 మొత్తం బరువు 3.8 టన్నులు. ఇస్రో 2009లో చంద్రయాన్-1ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే.

సన్నీలియోన్.. ప్రపంచంలో పరిచయం అవసరం లేనిపేరు ఈమెది

Tags:Chandrayaan on July 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *